
ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రైళ్లు క్యాన్సిల్ కాగా .. మార్చి 21 నుంచి ఏప్రిల్ 14 వరకూ టికెట్లు బుక్ చేసుకున్నవారికి మొత్తం డబ్బులు చెల్లిస్తామని తెలిపింది రైల్వేశాఖ. ఇప్పటివరకు క్యాన్సిల్ చేసుకున్నవారికి కూడామొత్తం డబ్బు చెల్లిస్తామని చెప్పింది.
అలాగే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు జూన్ 21లోగా డబ్బులు చెల్లిస్తామని ఈ సందర్బంగా సూచించింది రైల్వే. అటు ఐఆర్ సీటీసీలో బుక్ అయిన టికెట్లు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతాయని తెలిపింది రైల్వే. దీనిని ఆందోళన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది.