త్వరలో రైల్వే కౌంటర్లలో టికెట్‌ బుకింగ్‌: పీయూష్ గోయల్

త్వరలో రైల్వే కౌంటర్లలో టికెట్‌ బుకింగ్‌: పీయూష్ గోయల్

జూన్‌ 1 నుండి ప్రారంభం కానున్న రైల్వే సర్వీసుల కోసం ఇవాళ(గురువారం) ఉదయం 10 నుండి ఆన్‌లైన్‌ రిజర్వేషన్ ను  ప్రారంభించింది రైల్వేశాఖ. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రైల్వే కౌంటర్లు తెరుస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. టికెట్ల అమ్మకాలు ఇకపై రైల్వే కౌంటర్ల ద్వారా కూడా జరపబోతున్నామని చెప్పారు. రైల్వే టికెట్ల బుకింగ్ దేశంలోని 1.7 లక్షల సెంటర్లలో జరుగుతుందని ప్రకటించారు. ఇప్పటి వరకు IRCTC ద్వారా మాత్రమే రైల్వే టికెట్లు బుకింగ్ జరుగుతోంది. రైల్వే కౌంటర్లలో జరగడం లేదు. ఇకపై రైల్వే కౌంటర్లలో కూడా టికెట్లు ఇస్తామని చెప్పారు. త్వరలో మరిన్ని రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంటామని.. రైల్వే స్టేషన్లలో షాపులకు కూడా పర్మిషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే, దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు పీయూష్ గోయల్ ప్రకటించారు.