
హసన్‌పర్తి, వెలుగు: భారీ వర్షాల కారణంగా కేయూ పరిధిలో సోమవారం జరగాల్సిన ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించిన థియరీ, ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఎస్.నరసింహాచారి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వాయిదా పడిన ఎగ్జామ్స్‌ను ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని, మిగిలిన ఎగ్జామ్స్ అన్నీ యథావిధిగా జరుగుతాయని తెలిపారు.