గ్రేటర్ హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం

గ్రేటర్ హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం

గ్రేటర్ హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం మొదలైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వరద నీటితో పలు కాలనీలు, బస్తీల్లో ఉండే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. 

తార్నాక, సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, హయత్ నగర్, దిల్ షుక్ నగర్, లిబర్టీ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం, మాదాపూర్, ఆఫ్జల్ గంజ్ ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తోంది. 

ALSOREAD:రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

గ్రేటర్ హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. జంట జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. మరోవైపు.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.