హైదారాబాద్ లోని పలు చోట్ల వర్షం

హైదారాబాద్ లోని పలు చోట్ల వర్షం

హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెల్లవారుజామున 3 గంటల నుండి వర్షం కురుస్తుంది. అమీర్ పేట్, బంజారహిల్స్, పంజాగుట్ట, కూకట్ పల్లి, చందానగర్,బోరబండలో వర్షం పడింది.  సంతోష్ నగర్ లో 3.3 సెం.మీ,, మలక్ పేట్ లో 3 సెం.మీ, సరూర్ నగర్ లో 3,ఆర్.సి పురంలో 2 సెం,మీ, చార్మినార్ లో 1.6సెం.మీ,, ఫలక్ నుమా, జూబ్లీహిల్స్ లో 1.2 సెం.మీ,. రాజేంద్ర నగర్, కార్వాన్ లో 1 సెం.మీ, వర్ష పాతం నమోదయ్యింది. జీహెచ్ఎంసి అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. రోడ్ల మీద నీళ్లు ఆగకుండా చూడాలని GHMC కమీషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు.