Weather Update: హైదరాబాద్ లో భారీ వర్షం

Weather Update: హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. 2023, నవంబర్ 23వ తేదీ గురువారం ఉదయం హైదరాబాద్ లో వాతావరణం మారిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, ఫిల్మ్ నగర్, కృష్ణానగర్..ఎస్సార్ నగర్ తో పాటు సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతోంది.  దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే... తెల్లవారుజాము నుంచే మబ్బులు పట్టి ఉన్నాయి. ఇప్పుడు చిరు జల్లులు పడుతున్నాయి.  మరోవైపు చలి కూడా సిటీ జనాలను వణికిస్తోంది. 

ఎపి తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి బలహీన పడిందన్నారు వాతావారణ శాఖ అధికారులు. ఇవాళ తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని వివరించారు. దీంతో తెలంగాణలో అక్కడక్కడా 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ రాష్ట్రంలో అక్కడడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపారు.