కాళేశ్వరంలో మళ్లీ చేపల వర్షం

కాళేశ్వరంలో మళ్లీ చేపల వర్షం
  • గత నెల 20వ తేదీన పడినట్లే ఇవాళ కూడా చేపల వర్షం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరంలో మళ్లీ చేపల వర్షం కురిసింది. కాళేశ్వరంలోని ఇళ్లముందు, బైపాస్ రోడ్డు, మజీద్ పల్లి రోడ్డుపై ఆకాశం నుంచి చేపలు కిందపడ్డాయి. దీంతో జనం ఎగబడి చేపలు పట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. గత నెల 20న కూడా కాళేశ్వరంలో చేపల వర్షం కురిసిన విషయం తెలిసిందే. 
ఊహించనిరీతిలో కురిసిన చేపల వర్షం చర్చనీయాంశం అయింది. గత నెలలో చేపల వర్షంపై రకరకాల ప్రచారం కనుమరుగు కాకముందే.. ఇవాళ మరోసారి చేపల వర్షం కురవడం ఆశ్చర్యానికి గురిచేసింది. వర్షంతో పాటు చేపలు ఫట్ ఫట్ మని శబ్దం చేస్తూ...కిందపడ్డాయి. కాళేశ్వరంలోని పలువురి ఇంటి పరిసరాలలో, పల్గుల బైపాస్, మజీద్ పల్లి  రోడ్లపై వింత చేపలు ప్రత్యక్షం కావడం చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్య పోయారు.