
ప్రపంచ కప్-2019 లో దాయాదితో జరుగుతున్న మ్యాచ్ లో వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపి వేశారు. ప్రస్తుతం భారత స్కోరు 46.4 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఒపెనర్లు.. రోహిత్ శర్మ 140(113), రాహుల్ 57(78) రన్స్ చేశారు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ కోహ్లీ 71 (62) పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. హార్ధిక్ పాండ్యా 26(19), ధోనీ 1(2) పరుగులు చేశాడు. ఆతరువాత వచ్చిన విజయ్ శంకర్ 3(6) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు.