7 లక్షల లంచం తీసుకుని.. ఏడుకోట్ల భూమి డబుల్ రిజిస్ట్రేషన్..పరారీలో ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్

7 లక్షల లంచం తీసుకుని.. ఏడుకోట్ల భూమి డబుల్ రిజిస్ట్రేషన్..పరారీలో ఆదిలాబాద్  సబ్ రిజిస్ట్రార్

ఆదిలాబాద్ లో కాసులకు కక్కుర్తిపడిన సబ్ రిజిస్ట్రార్  భూమిని రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేశాడు.  లంచం తీసుకుని  కోట్ల విలువైన భూమిని రెండు సార్లు భూమిని రిజిస్ట్రేషన్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. 

ఈ ఘటనలో  అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ అశోక్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎడు కోట్ల  విలువైన భూమిని రెండుసార్లు  రిజిస్ట్రేషన్ చేశారు సబ్ రిజిస్ట్రార్. దీనికి ఏడు లక్షల లంచం తీసుకున్నాడు సబ్ రిజిస్ట్రార్.  బాధితుల ఫిర్యాదుతో  కేసు నమోదు చేసిన పోలీసులు అక్రమంగా డబుల్  రిజిస్ట్రేషన్  చేసి ముఠాను అరెస్ట్ చేశారు.  ఈ కేసులో  ఏ1  ఆర్డబ్ల్యు ఎస్  డీఈఈ  వెంకటరమణ, ఏ2 బీజేపీ మాజీ కౌన్సిలర్  రఘుపతి, ఏ3 రిమ్స్ ఉద్యోగి బెజ్జవార్ సంజీవ్  కుమార్ ను పోలీసులు  అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న  సబ్ రిజిస్ట్రార్ అశోక్ ను పోలీసులు పట్టుకునే పనిలో ఉన్నారు.