ఆరోగ్యకరమైన, అన్నిరకాల పోషకాలు దొరికే ఫుడ్ తినడం చాలా ముఖ్యం. అందుకోసం రంగురంగుల కూరగాయల సలాడ్ మంచి ఛాయిస్ అంటోంది సెలబ్రటీ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచివాలా.
డ్రెస్సింగ్ కోసం: కమలా పండు రసం – రెండు టేబుల్ స్పూన్లు, యాపిల్ సిడార్ వెనిగర్ లేదా నిమ్మరసం– సగం టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్– పావు టేబుల్ స్పూన్, ఉప్పు, మిరియాల పొడి రుచికి సరిపడా.
సలాడ్ కోసం: ఎరుపు, పసుపు, ఆకుపచ్చ క్యాప్సికం ముక్కలు (క్యూబ్ ఆకారంలో కోయాలి)– సగం కప్పు, బ్రకోలి ముక్కలు (కొంచెం సేపు వేడినీళ్లలో వేసి తీసినవి) – పావు కప్పు, క్యారెట్ తురుము– రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డ ముక్కలు– రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ: డ్రెస్సింగ్ కోసం తీసుకున్న పదార్థాలను ఒక గిన్నెలో కలిపి, ఫ్రిజ్లో పెట్టాలి. ఇంకో గిన్నెలో సలాడ్ ముక్కల్ని కలిపి డ్రెస్సింగ్ చేసుకుంటే రెయిన్ బో సలాడ్ రెడీ.
