హైదరాబాద్ లో మారిన వాతావరణం

హైదరాబాద్ లో మారిన వాతావరణం

హైదరాబాద్ లో వాతావరణం మారిపోయింది. సిటీలో పలుచోట్ల మోస్తరు వర్షం పడుతోంది. సికింద్రాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ , మొహిదీపట్నంలో వాన కురుస్తోంది. సిటీలో వర్షంతో ఆఫీస్ లకు వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి నుంచి వెదర్ అంతా కూల్ గా మారింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో 2,3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.  ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు.  ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు జిల్లాల్లో వడగళ్ల వానలు పడుతున్నాయి. వరంగల్, ఖమ్మం , నల్గొండ జిల్లాలో వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. 

దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి రాయల సీమ, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ చత్తిస్ ఘాట్ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తున సముద్ర మట్టనికి ద్రోణి ఆవరించి ఉంది. ద్రోణి కారణంగా రాష్ట్రంతో పాటు సిటీలోను పలుచోట్ల వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో - బషీర్బగ్, అబిడ్స్, కోఠి, నాంపల్లి తదితర ప్రాంతాల్లో చిరుజల్లులతో వర్షం పడుతోంది. వాతావరణం అంతా చల్లగా మారింది. 

ఇవి కూడా చదవండి: 

సొంతూళ్లకు జనం.. సగం సిటీ ఖాళీ

రోడ్డుపై గుట్టలుగా రూ.2000 నోట్ల కట్టలు