అటు ద్రోణి.. ఇటు రుతుపవనాలు : రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు

అటు ద్రోణి.. ఇటు రుతుపవనాలు : రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు

రాజస్థాన్ నుంచి ఛత్తీస్ ఘడ్ ఒడిస్సా మీదుగా.. తూర్పు పశ్చిమ బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో 5.8కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం ఉంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ, కోస్తాలో..  పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

నైరుతి రుతుపనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంలో మరిన్ని రోజులు వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు వాతావరణశాఖ అధికారులు. రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయన్నారు. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.