కూల్.. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షం

  కూల్..  ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షం

తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. చాలా మంది స్యూరుడి తాపానికి బయటకు రావాడానికి బయపడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు భానుడి భగభగలకు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో చల్లని వర్షం ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది. 

ఆదిలాబాద్ జిల్లా గుడియాత్నూర్ ఇచ్చోడ. బజారత్నూర్ మండలాల్లో వర్షం మోస్తారుగా కురుస్తు్ంది. ఇవాళ్టి నుంచి మార్చి 18 వరకు  తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. 

మరోవైపు ఏపీకి వర్ష సూచన ఇచ్చింది భారత వాతావరణశాఖ. ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒకటి రెండు చోట్ల మాత్రమే ఈ వర్షాలు ఉంటాయని పేర్కొంది. ఇక దక్షిణ కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో కూడా ఇవాళ, రేపు వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని, వేడి, తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.