రాజ్ కుంద్రాకు 14 రోజుల జుడీషియల్ కస్టడీ

V6 Velugu Posted on Jul 27, 2021

వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముంబై కోర్టు షాకిచ్చింది. కుంద్రాకు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. పోర్నోగ్రఫీ కేసులో ఈ నెల 19న రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్స్ ద్వారా పోర్న్ వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారనే ఆరోపపణలో ఆయనపై కేసు నమోదు చేశారు. మరోవైపు కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై రేపు(బుధవారం) బాంబే హైకోర్టులో విచారణ జరగనుంది.

రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నివాసంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. అయితే తన భర్త అమాయకుడని శిల్పా శెట్టి పోలీసు అధికారులతో అన్నట్టు సమాచారం. తన భర్త ఎరోటిక్ కంటెంట్ ను మాత్రమే అప్ లోడ్ చేశాడని, పోర్న్ కంటెంట్ ని కాదని ఆమె తెలిపింది.

Tagged Raj Kundra, remanded, Pornography Case, 14-day judicial custody, Mumbai court

Latest Videos

Subscribe Now

More News