
బాలీవుడ్ బ్యూటీ శిల్పా(Shilpa shetty) శెట్టి భర్త రాజ్ కుంద్రా(Raj kundra) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే పోర్న్ సినిమాలు రూపొందించిన విషయంలో రెండు నెలలు జైల్లోనే గడిపపి వివాదాలకు కేరాఫ్ గా మారిన రాజ్ కుంద్రా.. ఇప్పుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ టీవీ ప్రోగ్రాం ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అసలు విషయం ఏంటంటే.. ఇటీవల కపిల్‌శర్మ కామెడీ షోలో భార్య శిల్పాశెట్టి, మరదలు షమిత శెట్టి(Shamitha shetty) కలిసి పాల్గొన్నారు రాజ్‌కుంద్రా. షోలో రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. శిల్పా శెట్టిని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు చాలా కలిసొచ్చింది. ఎలా అంటే.. పెళ్లైన కొత్తలో శిల్ప చాలా పద్ధతిగా ఉండేది. పార్టీలుకు కూడా అటెండ్ అయ్యేది కాదు. రాత్రి 9 లకే నిద్రపోయేది. అందుకే ఎప్పుడైనా పార్టీకి వెళ్లాలనిపిస్తే ఆమె చెల్లెలు షమిత శెట్టిని తీసుకెళ్ళేవాడిని. ఇప్పటికి కూడా ఎక్కెడికైనా వెళ్లాలంటే ముందు షమిత పేరే వస్తుంది నాకు. అందుకే షమితాకు త్వరగా పెళ్ళికాకూడని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు రాజ్ కుంద్రా.
రాజ్ కుంద్రా చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. భార్య ఉండగా ఆమె చెల్లితో పార్టీ లు చేసుకోవడం ఏంటి? మళ్ళీ ఆమెకు పెళ్లి కాకూడదని కోరుకోవడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.