పోతురాజుకి కనెక్ట్ అవుతారు

పోతురాజుకి కనెక్ట్ అవుతారు

నందు, రష్మి జంటగా రాజ్ విరాట్ రూపొందించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌ ఈవెంట్‌‌లో నందు మాట్లాడుతూ ‘కథతో పాటు నన్ను నమ్మిన రష్మికి చాలా థ్యాంక్స్. షూటింగ్ టైమ్‌‌లో సరైన సదుపాయాలు లేక ఆమె చాలా ఇబ్బంది పడింది. అయినా మాకు సపోర్ట్ చేసింది. నిర్మాతలు అనుకున్న దానికంటే నెక్స్ట్ లెవెల్‌‌కి సినిమాను తీసుకెళ్లారు’ అన్నాడు. రష్మి మాట్లాడుతూ ‘నందుతో నాకు పద్నాలుగేళ్ల  జర్నీ ఉంది. తనపై నమ్మకంతో కథ కూడా వినకుండా ఓకే చెప్పా. బెస్ట్ ఔట్​పుట్ వచ్చింది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’ అంది. ఇందులో నందు చేసిన పోతురాజు క్యారెక్టర్‌‌‌‌కి అందరూ కనెక్ట్ అవుతారని చెప్పాడు దర్శకుడు రాజ్. మ్యూజిక్​ డైరెక్టర్​ ప్రశాంత్​ ఆర్​. విహారి, నటుడు కిరిటీ తదితరులు పాల్గొన్నారు.