ఫ్యామిలీతో కలిసి నవ్వుకునేలా రాజా ది రాజా: రుత్విక్

ఫ్యామిలీతో కలిసి నవ్వుకునేలా రాజా ది రాజా: రుత్విక్

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా అనిల్ బోయిడపు దర్శకత్వంలో కె. నిహారిక దాసరి నిర్మించిన చిత్రం రాజా ది రాజా'. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా శుక్రవారం రిలీజ్ అవుతోంది.  ఈ సందర్భంగా హీరో రుత్విక్ మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి. సొంత బ్యానర్‌‌‌‌లో హీరోగా పరిచయం అవ్వాలనుకున్నప్పుడు దాదాపు ఏడు కథలు విన్నా. అందులో బెస్ట్‌‌గా ఎంచుకున్న స్టోరీ ఇది. మేమంతా కొత్తవాళ్లమే అయినా ఎంతో ప్రేమతో, ప్యాషన్‌‌తో వర్క్‌ చేశాం.  

ఇదొక చక్కని యూత్‌‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్, విజువల్‌‌గా, మ్యూజికల్‌‌గా సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలోని రెండు గెటప్స్ కోసం పూర్తిగా ప్రిపేర్ అయ్యాను. కాస్ట్యూమ్స్ కూడా స్వయంగా చూసుకున్నాను. వీకే నరేష్, సాయికుమార్‌‌‌‌ లాంటి సీనియర్స్‌‌తో నటించడం గొప్ప అనుభవం. అన్నివర్గాల ప్రేక్షకులు ఎంజాయ్‌‌ చేసే ఫీల్ గుడ్ సినిమా ఇది. మంచి ఫన్, ఎమోషన్స్ ఉన్నాయి. థియేటర్‌‌‌‌ నుంచి ప్రేక్షకులు చిరునవ్వుతో బయటకు వస్తారు’ అని చెప్పాడు.