హైదరాబాద్, వెలుగు: టీడీపీలో చేరాలనే ఆలోచన తనకు లేదని, బీజేపీ నుంచే గోషామహల్‌లో పోటీ చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. బీజేపీ తప్ప తనకు ఏ పార్టీ సెట్ కాదని, నిరంతరం హిందూ ధర్మం కోసం సేవ చేస్తానని పేర్కొన్నారు.
బీజేపీ తప్ప ఏ ఇతర పార్టీలు తనను జాయిన్ చేసుకో వన్నారు. తనకు అండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కేంద్ర మంత్రులు ఉన్నారని, వారంతా ధైర్యం చెబుతున్నారన్నారు. బీజేపీలో తనపై సస్పెన్షన్ వేటు ఉందని, అది ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదని చెప్పారు.