ఇక సనాతన ధర్మం కోసం పోరాడుతా: రాజీనామా ఆమోదించడంపై స్పందించిన రాజాసింగ్

ఇక సనాతన ధర్మం కోసం పోరాడుతా: రాజీనామా ఆమోదించడంపై స్పందించిన రాజాసింగ్

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించిన విషయం తెలిసిందే. తన రాజీనామాను బీజేపీ ఆమోదించడంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే రాజాసింగ్. ‘‘సరిగ్గా 11 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నా. ప్రజలకు సేవ చేయడం, దేశానికి సేవ చేయడం, హిందూత్వాన్ని రక్షించడం కోసం నేను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా. 

బీజేపీ నన్ను నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గోషామహల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. నాపై నమ్మకం ఉంచినందుకు బీజేపీ కేంద్ర పార్టీకి.. పార్టీ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు నా రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కలతో రాత్రింబవళ్లు పనిచేస్తున్న లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల బాధను నేను ఢిల్లీకి తెలియజేయలేకపోవచ్చు.

నా నిర్ణయం ఏదైనా పదవి, అధికారం లేదా వ్యక్తిగతంగా తీసుకోలేదని స్పష్టం చేయాలనుకుంటున్నా.  నేను హిందుత్వానికి సేవ చేయడానికే పుట్టాను. నా చివరి శ్వాస వరకు హిందుత్వానికే పని చేస్తూనే ఉంటాను. హిందుత్వం, జాతీయత.. సనాతన ధర్మాన్ని రక్షించడానికి నేను ఎల్లప్పుడూ భక్తి.. నిజాయితీతో పని చేస్తా. సమాజ సేవ కోసం, హిందూ సమాజ హక్కుల కోసం నా చివరి శ్వాస వరకు నా గొంతుకను వినిపిస్తా’’ అని ట్వీట్ చేశారు రాజాసింగ్.

ALSO READ : బీజేపీది మొసలి కన్నీరు.. బీసీల నోటికాడి కూడును లాగొద్దు : మంత్రి పొన్నం

రాష్ట్ర నాయకత్వ తీరు, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్ 2025, జూలై 1న బీజేపీకి రాజీనామా చేశారు. అదే రోజున రిజైన్ లెటర్‎ను అప్పటి తెలంగాణ బీజేపీ చీఫ్​కిషన్ రెడ్డికి అందజేశారు. ఎమ్మెల్యే కావడంతో రాజాసింగ్ రాజీనామాను తెలంగాణ బీజేపీ పార్టీ హైకమాండ్‎కు పంపించింది. రాజాసింగ్ రాజీనామాకు 2025, జూలై 11న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదం తెలిపారు. దీంతో బీజేపీతో రాజాసింగ్‎కు బంధం తెగిపోయింది. హిందుత్వ భావజాలంతో పని చేసే ఓ ప్రాంతీయ పార్టీ వైపు రాజాసింగ్ చూస్తోన్నట్లు పొలిటికల్ సర్కిల్స్‎లో ప్రచారం జరుగుతోంది.