KCR లేక అసెంబ్లీలో కిక్కు లేదు.. ఆయనుంటే ఆ మజానే వేరు : రాజగోపాల్ రెడ్డి

KCR లేక అసెంబ్లీలో కిక్కు లేదు.. ఆయనుంటే ఆ మజానే వేరు : రాజగోపాల్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ LOP  లేక ఆపార్టీ నేతలు అసెంబ్లీలో తల్లి లేని పిల్లలుగా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని BRSపై రాజగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల మధ్యలో మీడియాతో రాజగోపాల్ రెడ్డి చిట్ చాట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాకపోవడం వల్ల హౌస్ లో కిక్కు లేదని.. కేసీఆర్ అసెంబ్లీలో చర్చలకు వస్తే ఆ మజానే వేరుగా ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఎల్వోపీ హరీష్ , కేటిఆర్ ఇద్దరిట్లో ఎవరికి ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఆగం అవుతదని అన్నారు. బీఆర్ఎస్ లో హరీష్ రావు వర్కరే.. కానీ ఆయనకు పదవులు ఉండవని చిట్ చాట్ లో చెప్పారు.

పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలని.. కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా వెళ్లారని మునుగోడు ఎమ్మెల్యే అన్నారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రె పార్టీని వీడకుండా ఉండాల్సిందని ఆయన అన్నారు. మహిళ అని సానుభూతి చూపిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా బీఆర్ఎస్ లోకి వెళ్లారని ప్రశ్నించారాయన.

తప్పుడు నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ సభలో ఉంటే సమాధానం చెప్పేవాడని రాజగోపాల్ రెడ్డి అన్నారు. నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ లేనప్పుడు సభలో ఎన్ని మాట్లాడిన సంవాదం ఉండదని వివరించారు. పవర్ మీద డిస్కషన్ లో కేసిఆర్ ఉండి ఉంటే ఇంకా బాగా జరిగేదని అభిప్రాయపడ్డారు. కేసిఆర్ ఓడిపోయిన ఇంకా జాతిపిత అనుకుంటున్నాడని.. BRS అధికారంలో ఉన్న పదేళ్లు ఆ పార్టీ ఎమ్మెల్యేలు  కేసీఆర్‌ను జాతిపిత అని పొగిడి ఆయన్ని ఆకాశం లో కూర్చ బెట్టారని అన్నారు. అధికారం పోయిన కేసీఆర్ ఇంకా అదే ఊహల్లో ఉన్నాడని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.