రాజమండ్రి రోజ్ మిల్క్ టైటిల్ సాంగ్ రిలీజ్

రాజమండ్రి రోజ్ మిల్క్ టైటిల్ సాంగ్ రిలీజ్

నాని బండ్రెడ్డి డైరెక్షన్ లో.. జై జాస్తి, అనంతిక  జంటగా నటిస్తున్న సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్.  ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి ఇంట్రూప్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి  నిర్మాతలు. ఇటీవల ఈ మూవీలోని ఓ సాంగ్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన టీమ్  లేటెస్ట్ గా టైటిల్‌సాంగ్‌ను విడుదల చేసింది.  ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..  ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రచించిన "నువ్వే ముద్దుగా నవ్వే నవ్వగా.. ఉండే నిండుగా.. ఫస్ట్‌డే ఫస్ట్ షో చూసినట్టుగా" అనే సాంగ్‌ను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

అజయ్ అరసాడ మ్యూజిక్ లో ఈ సాంగ్‌ను విడుదల చేశాం. పాటకు అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అందరికి కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ సినిమా గుర్తుకు తెప్పిస్తుందన్నారు. సన్నీల్ కుమార్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రణీత్ పట్నాయక్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న రాజమండ్రి రోజ్ మిల్క్  విడుదల తేదీని త్వరలోనే అనౌన్స్ చేస్తామన్నారు.