SSRMB: మహేష్తో మూవీపై మొదటిసారి స్పందించిన రాజమౌళి.. ఏమన్నారంటే?

SSRMB: మహేష్తో మూవీపై మొదటిసారి స్పందించిన రాజమౌళి.. ఏమన్నారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. ఇండియా వైడ్ గా సినిమా లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా మరోసారి ట్రేండింగ్ లోకి వచ్చింది ఈ సినిమా. కారణం.. ఈ సినిమా గురించి దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్స్. 

ఇటీవల రాజమౌళి ఫ్యామిలీతో కలిసి బళ్ళారి వెళ్లారు. అక్కడ ప్రముఖ దేవాలయ ప్రాణప్రతిష్టలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ కూడా పాల్గొన్నారు. అనంతరం రాజమౌళి అక్కడి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఓ రిపోర్టర్ రాజమౌళి నెక్స్ట్ సినిమా గురించి ప్రశ్నించారు. దానికి బదులుగా రాజమౌళి మాట్లాడుతూ.. నా తరువాతి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇక ఈ సినిమాను టైటిల్ ఫిక్స్ అవలేదు. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక రాజమౌళి, మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నారని సమాచారం. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా వస్తున్న ఈ సినిమా కథను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. మరి పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Also Read : సిద్ధమవుతున్న స్పిరిట్