
బాహుబలితో పాన్ ఇండియా ఫార్ములాను తెరమీదకు తీసుకొచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli). పురాణాల కథలనే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకురాగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి. లేటెస్ట్గా డైరెక్టర్ రాజమౌళికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్(Rajamouli Dream Project) అయినా మహాభారతంను 10 భాగాలుగా తీస్తానని గతంలోనే చెప్పాడు. మహాభారతం అనగానే ఎన్నో శక్తి వంతమైన క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. ఇటువంటి క్యారెక్టర్స్ లో ఎవ్వరు నటిస్తారని వరల్డ్ వైడ్ గా డిస్కస్ చేసుకుంటున్నారు.
తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఎవ్వరికైనా ప్రతిది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్ట్లో యాక్ట్ చేసే హీరోస్ ఎవరనేదనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ అయ్యింది. ఇక రాజమౌళి మైండ్లో టాలీవుడ్కి సంబంధించిన టాప్ హీరోస్ని ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్లో ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ కన్ఫర్మ్గా యాక్ట్ చేస్తారనే న్యూస్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇక లేటెస్ట్గా మరో స్టార్ పేరు చర్చలోకి వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మహా భారతంలోకి తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
రాజమౌళి ఈ ప్రాజెక్ట్స్ కోసం అన్నీ పర్ఫెక్ట్గా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసం ప్రభాస్( Prabhas) కర్ణుడుగా, మహేష్ బాబు(Mahesh Babu) కృష్ణుడు, రామ్ చరణ్(Ram Charan) అర్జునుడు,
ఎన్టీఆర్( NTR) భీముడు పాత్రలకు సెట్ అవుతారని రాజమౌళి భావిస్తున్నారట. ఇక అల్లు అర్జున్( Allu Arjun) క్యారెక్టర్ గురుంచి ఆలోచించే పనిలో ఉన్నారట. దీంతో టాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్స్ అంతా.. రాజమౌళి మహాభారతంతో ఏకం అవ్వటం ఖాయమే అంటున్నారు సినీ క్రిటిక్స్.
ఇక ఈ విజువల్ వండర్ మహాభారతాన్ని తెరకెక్కించాలంటే కనీసం 10 పార్ట్స్ ఐనా పడుతుందని, ఒక్కో పార్ట్ తెరకెక్కించడానికి కనీసం 4 సంవత్సరాల సమయమైనా పడుతుందని రాజమౌళి ఇది వరకే తెలిపాడు.
ALSO READ:ఏక్తాకపూర్కు టెలివిజన్ రంగంలో.. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్
మహాభారత కథ ఇతివృత్తంగా టాలీవుడ్లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో మన డైరెక్టర్స్కి ఉండే టాలెంట్ చాలా గొప్పదని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్లో ఎంతో ప్రతిభ చూపిస్తూ.. సక్సెస్కి కేరాఫ్ అడ్రస్గా మారారు.ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్కు ఇక ఏ లెవెల్లో తెరకెక్కిస్తాడో చూడాలి మరి.
ప్రస్తుతం ఈ దర్శకధీరుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. మొత్తం మూడు భాగాలుగా రానున్న ఈ అడ్వెంచరర్ ఫిలిం మొదటి పార్ట్ 2024 చివరిలో గానీ 2025 ఆరంభంలో గానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తరువాత జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట.