100 రోజులు పూర్తి చేసుకున్న 2.0

100 రోజులు పూర్తి చేసుకున్న 2.0

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన 2.0 నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ సోషల్ మీడియా ద్వారా సంతోషం తెలిపింది. 100 రోజుల లుక్ ను పోస్ట్ చేశారు. డైరెక్టర్ శంకర్ విజువ‌ల్ వండ‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. ప‌దివేల‌కి పైగా స్క్రీన్స్ లో విడుద‌లైన ఈ 2.0 బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టించింది.  హిందీలోనే వంద కోట్ల‌కి పైగా కలెక్షన్లు రాబ‌ట్టింది 2.0. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్ , అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ నిర్మించింది.  అక్ష‌య్ కుమార్ ప‌క్షి రాజా పాత్ర‌లో క‌నిపించ‌గా, అమీ వెన్నెల అనే రోబోగా అల‌రించింది. ఇక రజనీకాంత్‌ డాక్టర్‌ వశీకరణ్‌, చిట్టి, 2.ఓ, మైక్రోబోట్స్‌ 3.ఓ వంటి పలు పాత్రల్లో కనిపించి అల‌రించారు .