అనాధ పిల్లకు అండగా అన్నీతానైన పోలీసమ్మ

అనాధ పిల్లకు అండగా అన్నీతానైన పోలీసమ్మ

సీఐ మాధవి.. మంచి మనసున్న పోలీసమ్మ. ఆడ పిల్లలంటే ఆమెకు ప్రాణం. తన కళ్లముందు ఆడపిల్ల కంటతడి పెట్టినాతట్టు కోలేదు. తోచిన సాయం చేస్తుంది. తన ఠానాకు వచ్చే ప్రతిమహిళ సమస్యను తీర్చేవరకు ఊరుకోదు. తల్లిదండ్రులనుకోల్పోయిన ఒక ఆడపిల్లను దత్తత తీసుకొని తన కొడుకులతోసమానంగా కార్పొరే ట్ కాలేజీలో చదివిస్తోంది. అంతేకాదు శాంతి భద్రతల పరిరక్షణలోనూ తనదైన ముద్ర వేసుకుంది.మానవత్వాన్ని చాటుతూ.. వృత్తి ధర్మాన్ని పాటిస్తూ .. అందరిమెప్పూ పొందుతున్న మాధవి గురించి ఆమె మాటల్లోనే..

రాజన్నసిరిసిల్ల:‘మాది ఖమ్మం జిల్లా ఇల్లందు. నాకు 1996లోసబ్‌ ఇన్‌‌స్ పెక్టర్‌ గా ఉద్యోగం వచ్చింది. మొదటిపోస్టింగ్ ఆదిలాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌‌లో.ఆ తర్వాత మహేశ్ ను పెళ్లి చేసుకున్నా.వాళ్లది కరీంనగర్​. ఆయన కూడా పోలీసే.కరీంనగర్​ విజిలెన్స్ సీఐగా పని చేస్తున్నారు .2000 సంవత్సరంలో నేను కరీంనగర్‌ కుట్రాన్స్‌‌ఫర్​ అయ్యాను . చొప్పదండి, కరీంనగర్​, మానకొండూర్​లో ఎస్సైగా పని చేశాక సీఐగా ప్రమోషన్‌‌ వచ్చింది. 2014లో వేములవాడ రూరల్ సీఐగా పని చేశా. అప్పుడు రూరల్ సర్కిల్‌‌లో జరిగిన కొన్ని సంఘటనలు నన్నుకదిలించాయి. అప్పుడే నా వంతుగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నా. అనాథ పిల్లలకు తోచిన సాయం చేస్తున్నా. ప్రస్తుతం హుజురాబాద్ సీఐగా పని చేస్తున్నా.

సంచార జీవులను సదువుకు పంపి

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ సీఐగా పని చేస్తున్నప్పుడు చందుర్తి మండలం సనుగుల గ్రామానికి వెళ్లాను. అక్కడ వలస జీవులైన గంగిరెద్దుల వాళ్లు ఎక్కువగా ఉంటారు.వాళ్ల పిల్లలు చదువుకు దూరంగా ఉన్నారని,వాళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సరిగా అందడం లేదని తెలిసింది. చదువుకునే వయసులో తల్లిదండ్రులతో కలిసి పని చేస్తున్న పిల్లలు చూసి చాలా బాధ అనిపించింది. వాళ్లకు ఏదో ఒకటి చేయాలనిపించింది. అప్పటి ఎస్పీజోయల్ డేవిస్ కు, డీఎస్పీ నర్సయ్యకు విషయం చెప్పాను . వాళ్ల అనుమతితో ఒక కార్యక్రమాన్నిఏర్పాటు చేసి ఇరవై మంది పిల్లలను వేములవాడ ప్రభుత్వ హాస్టల్‌‌లో చేర్పించాను. వాళ్లకు అవసరమైన పుస్తకాలు, దుస్తులు కొనిచ్చా.కానీ.. వాళ్లు హాస్టల్‌‌లో ఉండలేక మళ్లీ ఇంటికి వెళ్లిపోయారు. దాంతో నేను మళ్లీ సనుగలవెళ్లి పిల్లలకు నచ్చజెప్పి హాస్టల్లో చేర్పించా. ఈసారి వాళ్లకు హాస్టల్ వాతావరణం అలవాటు చేయాలని చాలా ప్రయత్నాలు చేశా. తరచూ పిల్లలను కలిశాను. అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లి నా జీపులోనే వేములవాడ అంతా తిప్పి చూపించాను. మా ఇంటికి తీసుకెళ్లాను. కొత్తబట్టలు, గాజులు కొనిచ్చాను. చదువుకుంటే జీవితం ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పాను . అలా లాలించి..బుజ్జగించి చెప్తేహాస్టల్ ఉండేందుకు అలవాటు పడ్డారు.ఇప్పుడు వాళ్లంతా బాగా చదువుకుంటున్నారు.అంతేకాదు రైతుల కష్టాలు చూడలేక నా సర్కిల్ పరిధిలోని ఒక ఊరి చెరువు పూడిక కూడాతీయించా.

దత్త పుత్రిక భవాని

రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటమండలం నిమ్మపల్లికిలో గుమ్మడి భవాని తల్లిదండ్రులు కిష్టయ్య, లలిత 2015లోఆనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచి భవానీ బాగోగులు నేనే చూసుకుంటున్నా.అప్పటి సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్యతో కలసి దాతల నుంచి విరాళాలు సేకరించి భవాని పేరిట రెండున్నర లక్షల రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశా. ఆ తర్వాత భవానీని దత్తత తీసుకున్నా. తను పదో తరగతివరకు తంగళ్లపల్లి కస్తూరీబా పాఠశాలలో చదివించా. టెన్త్​లో భవానికి 9.7 జీపీఏ వచ్చింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. భవానికి చదువుపై శ్రద్ధబాగా ఉందని గ్రహించాను. హైదరాబాద్‌‌లో మా అబ్బాయి చదువుతున్న కళాశాలలోనే భవానీని చేర్పిం చా. భవాని బాగా చదివి వెయ్యి మార్కులకు గాను 969 మార్కులుతెచ్చుకుంది.