కంటైన్‌మెంట్ జోన్‌లోకి ఇత‌రులు.. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌పై క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హం

కంటైన్‌మెంట్ జోన్‌లోకి ఇత‌రులు.. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌పై క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హం

కంటైన్‌మెంట్ జోన్ ప‌రిధిలోకి ఇతరులు ప్రవేశించకుండా అడ్డుకోవడంలో వేముల‌వాడ మున్సిపల్ కమిషనర్ విఫ‌ల‌మ‌య్యారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మండిప‌డ్డారు. క‌మిష‌న‌ర్ శ్రీనివాస్ రెడ్డికి చార్జి మెమో జారీ చేశారు. 24 గంటల్లోగా ఈ ఘ‌టన‌పై ‌ వివరణ ఇవ్వ‌కపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా కేసులు పెర‌గ‌కుండా.. ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటించేలా ప‌లు ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్ర‌క‌టించింది. అయితే వేములవాడ లో కంటైన్ మెంట్ జోన్ పరిధిలో టీఆర్‌కె ట్ర‌స్ట్ ప్రతినిధులు అనుమతి లేకుండా కోడిగుడ్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ విష‌యం క‌తెలుసుకున్న జిల్లా క‌లెక్ట‌ర్ కృష్ణ భాస్కర్ వేముల‌వాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి చార్జి మెమో జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన టెక్నికల్ ఆఫీసర్ శ్రావణ్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ల‌ను సస్పెండ్ చేశారు.