నిర్లక్ష్య వైద్యం: ఎడమకి బదులు కుడి కంటికి ఆపరేషన్.. కేసు నమోదు చేసిన హెచ్ ఆర్సీ

నిర్లక్ష్య వైద్యం: ఎడమకి బదులు కుడి కంటికి ఆపరేషన్.. కేసు నమోదు చేసిన హెచ్ ఆర్సీ
  • నవంబర్ 6 లోగా నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్ వోకు ఆదేశం

అబిడ్స్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కొమ్ము వెంకమ్మకు ఎడమ కంటికి బదులుగా కుడి కంటికి శస్త్రచికిత్స చేశారన్న ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌‌‌‌ సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ ఘటనకు సంబంధించి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలను కమిషన్‌‌‌‌ పరిగణనలోకి తీసుకుంది. 

ఆరోపణలు నిజమైతే ఇది వైద్య నిర్లక్ష్యంతో పాటు రోగి భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశమని కమిషన్‌‌‌‌ పేర్కొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని రాజన్న సిరిసిల్ల డీఎంహెచ్‌‌‌‌వోను టీజీహెచ్‌‌‌‌ఆర్సీ ఆదేశించింది. శస్త్రచికిత్సకు సంబంధించిన వైద్య రికార్డులు, బాధితురాలి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఘటనపై చేపట్టిన విచారణలో వెల్లడైన అంశాలను నివేదికలో పొందుపరచాలని సూచించింది. ఈ నివేదికను నవంబర్‌‌‌‌ 6లోగా సమర్పించాలని టీజీహెచ్‌‌‌‌ఆర్సీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ షమీమ్‌‌‌‌ అక్తర్‌‌‌‌ ఆదేశాలు జారీ చేశారు.