రాజస్థాన్‭లో గ్యాస్ సిలిండర్ పేలి 4గురు మృతి.. 60 మందికి గాయాలు

రాజస్థాన్‭లో గ్యాస్ సిలిండర్ పేలి 4గురు మృతి.. 60 మందికి గాయాలు

రాజస్థాన్‭లోని జోధ్‭పూర్‭లో పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. భుంగ్రా గ్రామంలో ఓ వివాహ వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 60 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నీటి ట్యాంకర్లతో మంటలను అదుపుచేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గాయపడిన వారిలో వరుడు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 


భుంగ్రా నుంచి వరుడిని ఊరేగింపుగా తీసుకువచ్చే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం 60 మందిలో 42 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం నిమిత్తం వారిని ఎమ్ జీహెచ్ కు తరలించారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన చోటును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.