- రాజస్తాన్ రాయల్స్ ఆఫర్
లండన్: ఇంగ్లండ్ లిమిటెడ్ ఓవర్స్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు రాజస్తాన్ రాయల్స్ అదిరిపోయే కాంట్రాక్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఐపీఎల్‌తో పాటు వరల్డ్ వైడ్‌గా జరిగే లీగ్‌ల్లో రాయల్స్ టీమ్ తరఫున నాలుగేళ్ల పాటు ఆడేలా ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పెద్ద మొత్తంలో వాటాలున్నాయి. దీంతో ఫుట్‌బాల్ తరహాలో ఒకే కాంట్రాక్ట్‌తో అన్ని లీగ్‌ల్లో ఆడించేందుకు ప్లేయర్లతో ఒప్పందాలు చేసుకునేందుకు ఫ్రాంచైజీలు చర్చలు జరుపుతున్నాయి.
‘బట్లర్‌తో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకునేందుకు రాజస్తాన్ రాయల్స్ ప్రయత్నిస్తోంది. ఈ డీల్ విలువ ఎంత అన్నది ఇంకా తెలియదు. కానీ చాలా పెద్ద మొత్తంలో ఆఫర్ ఇచ్చేందుకు రాయల్స్ రెడీ అయినట్లుగా సమాచారం. అయితే ఈ వ్యవహారంపై ఫ్రాంచైజీగానీ, బట్లర్గానీ అధికారికంగా స్పందించలేదు’ అని టెలిగ్రాఫ్ పేర్కొంది.