
తన చిన్న కొడుకు చనిపోవడంతో పెద్దకొడుకును పెళ్లి చేసుకోవాలని ఓ అత్త కోడల్ని ఆదేశించింది. అందుకు కోడలు ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రికురాలైన అత్త..,కోడలి రక్తం కళ్ల చూసింది. రాజస్థాన్ లో దారుణం జరిగింది. జైస్మాల్ నగరంలో ఓ అత్త కోడలిపాలిట విలన్ గా మారింది. నిందితురాలి చిన్న కొడుకు మరణించడంతో అతని భార్యను పెద్ద కొడిక్కి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే తన పెద్దకొడుకును పెళ్లి చేసుకోవాలంటూ కోడల్ని ఆదేశించింది. కోడలు ఒప్పుకోకపోవడంతో అత్త వంటింట్లో ఉన్న కత్తితో కోడలి ముక్కు నాలుక కోసింది. ఆ నొప్పిని తాళలేక బాధితురాలు ఆహాకారాలు చేస్త పోలీసుల్ని ఆశ్రయించింది. అత్త అరళ్ల నుంచి తనని రక్షించాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.