కౌంటింగ్ కు సర్వం సిద్ధం: రజత్ కుమార్

కౌంటింగ్ కు సర్వం సిద్ధం: రజత్ కుమార్

రేపు పొద్దున 8 గంటలకు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని తెలిపారు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్. సెక్రటేరియట్ లో మాట్లాడిన ఆయన.. 17నియోజక వర్గాలకు గాను 35 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లను  ఎజెంట్స్ ముందు ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత.. EVM లను కౌంటింగ్ చేయనున్నట్లు చెప్పారు. 186 మంది (నోటా తో కలిపి) పోటీచేసిన నిజమాబాద్ నియోజకవర్గంలో 36టేబుళ్లను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.

ఎండలు మండుతుండటంతో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు రజత్ కుమార్ తెలిపారు. EVM ల కౌంటింగ్ 8.30నిమిషాలకు మొదలవనున్నట్లు చెప్పారు. ఆర్వోలకు ఇప్పటికే రెండు సార్లు ట్రైనింగ్ ఇచ్చామని… సీసీ కెమరాల నిఘాలో కౌంటింగ్ ఉంటుందని చెప్పారు.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోని 5వీవీ ప్యాట్ లను అభ్యర్థుల ముందు డ్రా చేసి కౌంట్ చేస్తామని తెలిపారు రజత్ కుమార్. EVM లు పని చేయకపోతే.. వివిప్యాట్ లను లెక్కపెడతామని అన్నారు.

రూల్ 56 D ప్రకారం రీ కౌంటింగ్ ఉంటుందని అన్నారు రజత్. అది కూడా ఆర్వో ఆదేశాల మేరకు మాత్రమే అని చెప్పారు. అభ్యర్థి వ్రాత పూర్వకంగా అప్లికేషన్ ఇస్తేనే రీ కౌంటింగ్ జరిపిస్తామని అన్నారు.  ECI ఆదేశాల మేరకు మొదటి ఫలితం ఎక్కడ లాస్ట్ ఫలితం ఎక్కడ అనేది చెప్పమని…చెప్పకూడదని తెలిపారు. రాష్ట్రంలోని 17నియోజకవర్గాలకు గాను.. 6 వేల 500 మంది సిబ్బంది ఉన్నారు అయితే నిజామాబాద్ కౌంటింగ్ ను దృష్టి లో పెట్టుకొని మరి కొంత అదనపు సిబ్బంది ఆడ్ అవనున్నట్లు చెప్పారు… కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

మొబైల్ పోన్ లు కౌంటింగ్ కేంద్రాల లోపలికి అనుమతి లేదని తెలిపారు రజత్ కుమార్. పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు ఫలితాలు విడుదల చేస్తామని… పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షణ చేస్తారని చెప్పారు. మీడియా కెమెరాలను లోపలకి అనుమతిస్తామని అయితే కెమెరా స్టాండ్ వేసుకోవద్దని తెలిపారు. రేపు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు కూడా మూసివేయాలని ఆదేశాలు ఇచ్చింది.