జేఎస్‌‌‌‌డబ్ల్యూ రాకతో ఇక దూకుడే

జేఎస్‌‌‌‌డబ్ల్యూ రాకతో ఇక దూకుడే
  •     ఎంజీ మోటార్స్‌‌‌‌ ఇండియా సీఈఓ రాజీవ్‌‌‌‌ చాబా 

న్యూఢిల్లీ: జేఎస్‌‌‌‌డబ్ల్యూ గ్రూప్ ఇన్వెస్ట్ చేయడంతో మరింత వేగంగా విస్తరిస్తామని ఎంజీ మోటార్స్ ఇండియా సీఈఓ రాజీవ్‌‌‌‌ చాబా పేర్కొన్నారు. టెక్నాలజీ, కస్టమర్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌, కమ్యూనిటీ సర్వీస్ వంటి అంశాల్లో స్ట్రాంగ్‌‌‌‌గా ఉన్నామని, ప్రస్తుతం నెక్స్ట్‌‌‌‌ ఫేజ్‌‌‌‌పై ఫోకస్ పెట్టామని అన్నారు. ఇన్వెస్టర్లు వస్తున్నారు కాబట్టి ఇక నుంచి  బిజినెస్ విస్తరణ మరింత వేగంగా జరుగుతుందని ఆయన అంచనా వేశారు. 

ఫౌండేషన్ బలంగా ఉంటే వేగంగా విస్తరించొచ్చని అన్నారు. కొత్త ఇన్వెస్టర్ జేఎస్‌‌‌‌డబ్లూ గ్రూప్ రావడంతో ఎంజీ మోటార్స్ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్స్ ఏంటనే ప్రశ్నకు సమాధానంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.  చైనీస్ కంపెనీ ఎస్‌‌‌‌ఏఐసీ మోటార్‌‌‌‌‌‌‌‌, జేఎస్‌‌‌‌డబ్ల్యూ గ్రూప్‌‌‌‌  కలిసి జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌పై   వచ్చే వారం సంతకాలు చేయనున్నాయి. ఈ జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌లో జేఎస్‌‌‌‌డబ్ల్యూ గ్రూప్‌‌‌‌కు 35 శాతం వాటా ఉంటుంది.   

బ్రిటీష్ బ్రాండ్‌‌‌‌ ఎంజీ మోటార్‌‌‌‌‌‌‌‌లో మెజార్టీ వాటా చైనీస్ కంపెనీ ఎస్‌‌‌‌ఏఐసీ మోటార్‌‌‌‌‌‌‌‌కు ఉంది. ఇండియా బిజినెస్‌‌‌‌ను మరింతగా విస్తరించాలనే ఆలోచనతో జేఎస్‌‌‌‌డబ్ల్యూ గ్రూప్‌‌‌‌తో కలిసి జాయింట్‌‌‌‌ వెంచర్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తోంది. రెండో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌‌‌‌ను ఏర్పాటు చేయడానికి రూ.4,000 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని 2022 లో ఎంజీ మోటార్స్ ప్రకటించింది. గుజరాత్‌‌‌‌లో ఈ ప్లాంట్ పెట్టే అవకాశం ఉంది.