ప్రేయసి రావే, అయోధ్య రామయ్య, చెప్పాలని వుంది, జోరుగా హుషారుగా, ఒక్కడే వంటి పలు చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు మహేష్ చంద్ర. తాజాగా తను రూపొందిస్తున్న సినిమా ‘పిఠాపురంలో’. అలా మొదలైంది అనేది ట్యాగ్‌లైన్. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి (గోదారి కిట్టయ్య) నిర్మిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో మూడు జంటల ప్రేమకథలతో పాటు ముగ్గురు తండ్రుల పెంపకాల్లోని లోటుపాట్లను చూపించబోతున్నట్టు దర్శకుడు మహేష్ చంద్ర చెప్పాడు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు అన్నారు.
