గండిపేట, వెలుగు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శివరాంపల్లిలో ఆదివారం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో ఫర్నిచర్, ఫ్రిడ్జి, వాషింగ్ మిషన్, ఇన్వైటర్, బీరువా, మంచం, వంట సామగ్రి, నగదు కాలిపోయాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఈ ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు.
సూరారంలో..
జీడిమెట్ల: ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి మహిళకు గాయాలయ్యాయి. సూరారం రాజీవ్‌గృహకల్పలో నివాసముండే గడ్డమీది జనార్ధన్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఇతడు భార్య, పిల్లలు, తల్లితో కలిసి బ్లాక్‌నంబర్82లో ఉంటున్నాడు. శనివారం రాత్రి కరెంట్ పోవడంతో జనార్ధన్ భార్య క్యాండిల్ వెలిగించి కూలర్‌పై పెట్టి దుకాణానికి వెళ్లింది. అనంతరం ఇంట్లోంచి మంటలు రావడంతో చుట్టుపక్కల వారు వెళ్లి ఆర్పారు. ప్రమాదంలో జనార్ధన్ తల్లి శాంతమ్మకు గాయాలయ్యాయి. మంటల్లో రూ.20 వేలు కాలిపోయాయి.
హోటల్ కిచెన్‌లో..
మియాపూర్: షార్ట్ సర్క్యూట్‌తో ఓ హోటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మియాపూర్ న్యూ హాఫిజ్ పేటలోని రుమాన్ హోటల్ వంటగదిలో ఆదివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమపాక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
