న్యూఢిల్లీ: తమపై వచ్చిన ఆరోపణలను బెంగళూరు కంపెనీ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ తోసిపుచ్చింది. తమ స్విస్ సబ్సిడరీ 'వాల్‌కాంబ్లి' ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ అని, దాని ఆదాయ రిపోర్టులన్నీ నూటికి నూరు శాతం నిజమైనవేనని స్పష్టం చేసింది. తమది రూపాయి అప్పు లేని క్లీన్ కంపెనీ అని, సెబీ అడిగిన అన్ని ప్రశ్నలకు తగిన ఆధారాలు, పత్రాలు సమర్పించి త్వరలోనే క్లీన్ చిట్ తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేసింది.
ఎల్ఐసీతో సహా ఏ దేశీయ ఆర్థిక సంస్థకు తాము నేరుగా షేర్లను కేటాయించలేదని స్పష్టం చేసింది. తప్పుడు ఆర్థిక రిపోర్టులు ఇవ్వడం, నిధుల మళ్లింపు ఆరోపణలపై సంస్థ సీఈఓ రాజేష్ మెహతాను మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది. ఐదేళ్ల కాలంలో రూ. 15 లక్షల కోట్ల మేర కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని ఎక్కువగా చూపినట్లు సెబీ పేర్కొంది.
