మెదక్, వెలుగు: తెలంగాణ ఎయిడ్స్ కౌన్సిలర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా మెదక్ కి చెందిన కాముని రాజేశ్వర్ ఎన్నికయ్యారు. శనివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఈయన ప్రస్తుతం మెదక్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఎయిడ్స్ కౌన్సిలర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో యూనియన్ మెదక్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర కమిటీలో చురుకుగా పాల్గొనడం వల్ల రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేశారు.
