
గతేడాది ‘జైలర్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న రజినీకాంత్, త్వరలో ‘లాల్ సలామ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తన కూతురు ఐశ్వర్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు. ఫిబ్రవరి 9న ఇది విడుదల కానుంది. మరోవైపు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టైయన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు రజినీ.
ఆయన కెరీర్‌లో ఇది 70వ చిత్రం. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా నుంచి రజినీకాంత్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘బాషా’తో సహా పలు చిత్రాల్లోని ఆయన ఐకానిక్ లుక్‌ను గుర్తు చేసేలా ఇందులో తలైవా గెటప్ కనిపిస్తోంది. గన్ పట్టుకుని ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. ఆయన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పుదుచ్చేరిలో జరుగుతోంది. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించనున్నారు.