COOLIE: భారీ రన్‌టైమ్‌తో యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’.. ట్రెండ్ కొనసాగిస్తూనే అంచనాలు పెంచిన లోకేష్

COOLIE: భారీ రన్‌టైమ్‌తో యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’.. ట్రెండ్ కొనసాగిస్తూనే అంచనాలు పెంచిన లోకేష్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నాగార్జున విలన్గా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ (COOLIE). ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ వంటి భారీ తారాగణంతో మూవీ రిలీజ్ కానుంది.

ఇప్పటికే, ఈ స్టార్ యాక్టర్స్కి సంబందించిన లుక్స్, టీజర్, ట్రైలర్, విజువల్స్.. సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. సినిమా విడుదలకు ఇంకా 6 రోజులే మిగిలుంది. దాంతో ప్రమోషన్స్లో వేగం పెంచారు మేకర్స్.

ఈ క్రమంలోనే ‘కూలీ’సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా ఏకంగా 2 గంటల 50 నిమిషాల పాటు వస్తుండటం ఇంట్రెస్ట్ పెంచుతోంది. (ఇందులో 'కార్డ్ యొక్క యానిమేటెడ్ విజువల్స్ RAJNI50ఇయర్స్' కూడా ఉంది) సర్టిఫికేషన్ ప్రకారం ఇది 25 సెకన్ల క్లిప్.

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. తన గత సినిమాల్లాగే ఈ మూవీని కూడా చాలా ఎక్కువ రన్ టైమ్ తోనే తీసుకొస్తున్నాడు. కార్తి నటించిన ఖైదీ మూవీ 2 గంటల 25 నిమిషాలు, మాస్టర్ మూవీ దాదాపు 3 గంటలు, విక్రమ్ సైతం దాదాపు 3 గంటలు (2గంటల 54 నిమిషాలు), లియో 2 గంటల 44 నిమిషాలు ఉన్నాయి. ఇప్పుడు కూలీ కూడా ఏకంగా 2 గంటల 50 నిమిషాల నిడివితో వస్తుండటం విశేషం.

ఈ క్రమంలోనే స్టార్ క్యాస్టింగ్తో వస్తోన్న ఇలాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు 2 గంటల 50 నిమిషాల నిడివి ఉండటం ఓ రకంగా మంచిదని అంటున్నారు సినీ క్రిటిక్స్. అయితే, లోకేష్, రజినీ కెరియర్లో Aసర్టిఫికెట్ పొందిన తొలి మూవీగా కూలీ వస్తుంది. సినిమాకు ఇదే మైనస్గా నిలుస్తుందని లోకేష్, రజినీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 

►ALSO READ | Kantara Actor: ఇంట్లోనే హఠాత్తుగా కుప్పకూలి.. కాంతారా నటుడు కన్నుమూత

ఇదిలా ఉంటే.. కూలీ మూవీలో రజనీకాంత్ దేవాగా, సైమన్గా నాగార్జున, రాజశేఖర్గా సత్యరాజ్, కలీషాగా ఉపేంద్ర, ప్రీతిగా శ్రుతిహాసన్, దయాళ్గా సౌబిన్ షాహిర్ నటిస్తున్నారు. అమీర్ ఖాన్ దహా పాత్రలో మెప్పించనున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై 'కూలీ' చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇదే ఆగస్టు 14 రోజున.. ఎన్టీఆర్, హృతిక్ నటిస్తున్న వార్ 2 సైతం విడుదల కానుంది. ఈ రెండు సినిమాల కోసం సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి యుద్ధం జరగనుందో చూడాలి. 

NOTE:

'A' సర్టిఫికేట్: ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాలను 18 సంవత్సరాలు పైబడిన పెద్దలు మాత్రమే చూడాలి. ఈ సినిమాల్లో ఎక్కువ హింసాత్మక దృశ్యాలు, పూర్తి నగ్నత్వం, దూషించే భాష అన్నీ ఉంటాయి.