COOLIE Box Office: భారీ కలెక్షన్లతో కుమ్మేసిన ‘కూలీ’.. తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

COOLIE Box Office: భారీ కలెక్షన్లతో కుమ్మేసిన ‘కూలీ’.. తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

రజనీకాంత్ నటించిన ‘కూలీ’ అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా నిన్న (ఆగస్ట్ 14న) విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్ డే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.65 కోట్ల భారీ నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతనేది మాత్రం, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అయితే, ప్రపంచవ్యాప్తంగా రూ.145 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిపుణుల అంచనాలు చెబుతున్నాయి. కాసేపట్లో గ్రాస్ ఎంతనేది మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, భారీ హైప్‌తో విడుదలైన కూలీ మూవీ.. వార్ 2తో పోటీపడి బాక్సాఫీస్ యుద్ధంలో తొలిరోజు వసూళ్లలో ముందంజలో నిలిచింది.

సాక్నిల్క్ నివేదిక ప్రకారం:

కూలీ తమిళనాడులో మంచి ఓపెనింగ్స్ అందుకుంది. అక్కడ ఈ మూవీ రూ.45 కోట్లు వసూళ్లు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు అత్యధిక ఓపెనింగ్స్ నమోదు చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.15 కోట్లు సాధించగా.. హిందీలో 4.5 కోట్లు, కర్ణాటకలో రూ.50 లక్షలు వసూళ్లు చేసింది.

కూలీ ఫస్ట్ డే అన్ని షోలకి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.ఈ క్రమంలో తమిళంలో 86.99 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయగా, హిందీలో 35.66 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. మరోవైపు, ఇండియాలో 900కు పైగా షోలు వేసిన కూలీ, తెలుగులో 92.10 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

అంతేకాకుండా, నార్త్ అమెరికాలో కూలీ అదిరిపోయే ప్రీమియర్ షో రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రీమియర్స్ ద్వారా ఏకంగా 3.04 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఇది తమిళ సినిమాల్లో హయ్యెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్ అని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.