
2025 ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద యుద్ధమే జరగనుంది. ఇదే రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’. అలాగే ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించిన 'వార్ 2' సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 'కూలీ', 'వార్ 2' ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే, విడుదలైన ఈ సినిమాల ప్రమోషనల్ కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఇపుడిక 8 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో.. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేయబోయే ప్రభంజనాలపై నిపుణులు లెక్కలేయడం మొదలుపెట్టారు.
‘కూలీ’ vs ‘వార్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్:
ఇండియాలో కూలీ, వార్ 2 సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభంకాలేదు. ఓవర్సీస్లో మాత్రం ఇప్పటికే ఓపెన్ అయ్యి.. హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో US బుకింగ్స్లో వార్ కంటే కూలీ మూవీ విస్తృత తేడాతో రేసులో ముందంజలో ఉంది. అమెరికాలో తెలుగు, తమిళ అడ్వాన్స్ బుకింగ్‌లలో కూలీ తన సత్తా చాటుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఉత్తర అమెరికాలో ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూలీ 40,000కి పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీన్ని ద్వారా USD 969,551 సంపాదించింది. వార్ 2 USD 184,483 సంపాదించి 6,980 టిక్కెట్లతో వెనుకబడి ఉంది. ఈ విధంగా కూలీ ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా $1.06 మిలియన్లు దక్కించుకుని దూసుకెళ్తోంది. అంతేకాకుండా ప్రీ-సేల్స్‌లో అత్యంత వేగంగా $1 మిలియన్ మార్కును దాటిన తమిళ చిత్రంగా కూలీ నిలిచింది.ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్ తోనే 2 మిలియన్ డాలర్లు కొల్లగొట్టేందుకు కూలీ పరుగులు తీస్తోంది.
#Coolie Storm Sweeps North America!❤️🔥
— Prathyangira Cinemas (@PrathyangiraUS) August 4, 2025
40,000+ tickets sold for premieres and counting…. Pa Pa Paratta Power House’Ae 🔥🔥🔥
Grand USA premieres on Aug 13th 💥
NA release by @PrathyangiraUS #CoolieUSA @rajinikanth @iamnagarjuna @sunpictures @Hamsinient pic.twitter.com/qSgWODBvlp
అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అమెరికా, కెనడాలో కూలీ సినిమాకు గానూ ప్రీమియర్ షోకు సంబంధించి కేవలం 1160 షోలను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయగా.. వార్ 2 సినిమాకు మాత్రం 1600 షోలు ప్రదర్శించేందుకు సన్నాహాలు చేశారు. అయినప్పటికీ.. తక్కువ షోలతోనే ఎక్కువ బుకింగ్స్ కూలీ మూవీ జరుపుకోవడం విశేషమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క నార్త్ అమెరికాలోనే కాకుండా యూకే, మలేషియా, గల్ఫ్, సింగపూర్ వంటి ఇతర దేశాల్లో కూడా భారీ స్థాయిలో టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి.
వార్ 2 విషయానికి వస్తే.. నార్త్ అమెరికాలో తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బాగానే ఉన్నప్పటికీ.. హిందీ వెర్షన్ ప్రీ సేల్స్ అంతగా లేకపోవడం షాకింగ్‌గా మారింది. ఈ సినిమా కేవలం 5 వేల డాలర్లే వసూలు చేయడం గమనార్హం. అయితే రానున్న ఈ వారం రోజుల్లో హిందీ, తెలుగు వెర్షన్ టికెట్ల అమ్మకాలు మరింత పెరగాల్సిన అవసరముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కూలీ మూవీలో నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించడం సినిమాకు మరో మెయిన్ హైలెట్. ఇక 2019 లో ‘వార్’ మూవీ వచ్చి సూపర్ హిట్ అయింది. ఇపుడా ఆ మూవీ సీక్వెల్ లో హృతిక్, ఎన్టీఆర్ నటించడం సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయి.
ఈ రెండు సినిమాలు ఆగస్టు 14న విడుదల కానున్నాయి. డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ నేతృత్వంలో ఏషియన్ సంస్థ కూలీ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాయి. వార్ 2 సినిమాను సితార బ్యానర్ పై నిర్మాత నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు.
ప్రస్తుతానికైతే.. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూలీ తన సత్తా చాటుతుంది. సినిమా రిలీజయ్యాక.. టాక్ ఏ సినిమాకు బాగుంటే.. అది మాత్రమే కోట్లు కొల్లగొట్టం కన్ఫామ్ అని నిపుణుల లెక్కలు చెబుతున్నాయి. మరి ఏమవుతుందో చూడాలి.