రజిని పార్టీ సింబల్ గా సైకిల్..?

రజిని పార్టీ సింబల్ గా సైకిల్..?

1996 అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచారం సమయంలో మళ్లీ జయలలిత అధికారంలోకి వస్తే తమిళనాడు ఆ దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించారు.
ఆ ఒక్క కామెంట్ తో అధికారంలో ఉన్న జయలలిత పార్టీ అన్నాడీఎంకే ఓటమి పాలైంది. ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే విజయం సాధించింది. నాటి నుంచి రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు విజ్ఞప్తి చేశారు. తలైవా మాత్రం ఓ నవ్వు నవ్వి అభిమానుల్ని నిరుత్సాహ పరిచేవారు. తాజాగా తలైవా తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

పార్టీ పేరు, విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ గుర్తు పై ఏ చిహ్నాన్ని ఎంపిక చేయాలో చెప్పాలంటూ తన అభిమానుల్ని కోరినట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి బాబా గుర్తు. రజినీ బాబా భక్తుడు కాబట్టి ఆ సింబల్ ను పార్టీ గుర్తుగా ఎంపిక చేస్తారని సమాచారం. అయితే ఆ సింబల్ నే కేటాయించాలని కోరుతున్నారు. కానీ ఎన్నికల సంఘం కేటాయించే గుర్తుల్లో బాబాగుర్తులేదని, దీంతో బాబా గుర్తుకు ఈసీ అనుమతి ఇవ్వలేకపోవచ్చనేది కొందరంటున్నారు. అన్నమలై చిత్రంలో పాలమ్మే వ్యక్తి క్యారక్టర్ లో రజని సైకిల్ పై పాలమ్ముతూ పాడిన పాట చాలా పాపులర్. దీంతో రజని పార్టీ గుర్తుగా సైకిల్ చిహ్నాన్ని సెలక్ట్ చేసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.