
తమిళ స్టార్ హీరో రజనీకాంత్(Rajinikanth) హీరోగా వచ్చిన జైలర్(Jailer) సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెల్సన్ కుమార్(Nelson kumar) దర్శకత్వంలో భారీ అంచనాల మంధ్య రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి యునానిమస్ పాజిటీవ్ టాక్ వచ్చింది. ఒకటి రెండు సీన్స్ మినహాయిస్తే.. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు రజని ఫ్యాన్స్.
అయితే కొంత మంది ఏ సినిమాకు కావాలనే నెగిటీవ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని రజని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు జైలర్ సినిమాకు నెగిటీవ్ రివ్యూ ఇచ్చారని కొండు వ్యక్తులను చితక బాదారు రజనీకాంత్ ఫ్యాన్స్ ఈ సంఘటన చెన్నైలోని వెట్రి థియేటర్ వద్ద చోటుచేసుకుంది. జైలర్ షో మిగిసాక సినిమా ఎలా ఉందని విలేకరులు రివ్యూలు అడగగా.. సదరు వ్యక్తులు తమకు నచ్చలేదని. అస్సులు బాగోలేదని చెప్పుకొచ్చారు. అది విని కోపంతో ఊగిపోయిన రజనీకాంత్ ఫ్యాన్స్.. ఆ వ్యక్తులను కొట్టారు. ఆ ఇద్దరు విజయ్ ఫ్యాన్స్ అని.. కావాలనే రజని సినిమాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని రజని ఫ్యాన్స్ ఆరోపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
#Rajinikanth fans continue to embarrass their ‘#Thalaivar’ @rajinikanth by engaging in violent activities. They beat up a harmless #ThalapathyVijay fan for expressing his opinion on the #Jailer movie. These cowards should be severely punished #JailerReviewpic.twitter.com/CKlgvJZZbw
— Ajay AJ (@AjayTweets07) August 10, 2023
ఇక ఈ వీడియో చూసిన చాల మంది నెటిజన్స్.. రజనీకాంత్ ఫ్యాన్స్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏ సినిమా అయినా అందరికీ నచ్చాలని రూల్ లేదు. కొంత మందికి నచ్చకపోవచ్చు. అంతమాత్రానా ఇలా కొట్టడం అనేది సరైన పద్దతికాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.