సంఘీ అంటే తప్పు కాదు.. వివాదంపై క్లారిటీ ఇచ్చిన రజినీకాంత్

సంఘీ అంటే తప్పు కాదు.. వివాదంపై క్లారిటీ ఇచ్చిన రజినీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సలామ్(Laal Salaam). రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌(Aishwarya Rajinikanth) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించగా.. ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఇటీవలే లాల్ సలామ్ ఆడియో ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. 

ఈ ఈవెంట్ లో దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్‌ స్పీచ్ వివాదానికి దారితీసింది. నిజాంనికి నా తండ్రి సంగీ(మతవాది) కాదని.. అయుంటే ఈ సినిమా చేసేవారు కాదని అన్నారు. ఈ స్పీచ్ లో ఆమె సంఘీ అనే పదాన్ని వాడటంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఈ వివాదంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు హీరో రజినీకాంత్. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ వేట్టైయాన్‌. జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లోనే కడపలో జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఉందయం విమానాశ్రయంలో కనిపించారు. 

ఆ సమయంలో సంఘీ వివాదం గురించి మీడియా ప్రస్తావించగా దాని సమాధానంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. ఐశ్వర్య ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు, తన తండ్రి ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి అని, అలాంటి దృష్టిలో ఎందుకు చూస్తారని మాత్రమే ఆమె అన్నారని.. చెప్పుకొచ్చాడు రజిని. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.