
లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj).. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదొక బ్రాండ్. తీసింది కేవలం ఐదు సినిమాలే కానీ, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో తన సినిమాలకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు లోకేష్. అందుకే ఆయన సినిమాలపై చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు ఆడియన్స్.
ఇటీవలే విజయ్ తలపతి తో ఆయన తీసిన లియో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన ఈ సినిమా ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా తరువాత లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తో ఓ సినిమా చేస్తున్నాడు. తలైవార్171(Thalaivar 171) వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా గురించి, సినిమాలో రజినీకాంత్ పాత్రపై అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీ నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన ఎక్స్ వేదికగా రిలీజ్ చేశాడు.ఇక ఈ పోస్టర్‌లో రజినీకాంత్ లగ్జరీ వాచ్‌లు దొంగతనం చేసే దొంగలా కనిపిస్తున్నాడు. రజినీ హెయిర్ స్టైల్ యంగ్ లుక్స్ లో ఉండగా..గోల్డ్ కలర్ స్పెక్ట్స్, మేడలో చెయిన్ ఇలా ప్రతిదీ వావ్ అనేలా ఉంది. అలాగే ఈ సినిమా టైటిల్‌ను ఏప్రిల్ 22న రిలీజ్ చేయబోతున్నట్లు లోకేష్ తెలిపాడు.
ఈ మూవీని లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా..మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. రజినికాంత్ కెరీర్ లోనే సరికొత్తగా వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
#Thalaivar171TitleReveal on April 22 ? pic.twitter.com/ekXFdnjNhD
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 28, 2024