రజినీకాంత్ లాల్ సలామ్ OTT డీటెయిల్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

రజినీకాంత్ లాల్ సలామ్ OTT డీటెయిల్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రత్యేక పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్(Lal Salaam). రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్(Aishwarya Rajinikanth) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్(Vikranth) హీరోలుగా నటించారు. టీజర్, ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజయింది. నిజానికి ముందు నుండే ఈ సినిమాకు బజ్ లేకపోవడంతో ఆడియన్స్ నుండి రియాక్షన్ కూడా అలాగే వచ్చింది. సినిమాకు టాక్ కూడా  సో సో గానే వచ్చింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి ఈ సినిమాకు. 

ఇక థియేటర్ లో అనుకున్న రెస్పాన్స్ రాకపోవడంతో.. ఓటీటీ రిలీజ్ గురించి ఇప్పటినుండే చర్చ మొదలయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో త్వరలోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మార్చ్ ఫస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ కానుందట. త్వరలోనే ఇదే విషయంపై అధికారిక ప్రకటన రానుంది. మరి థియేటర్ లో ప్లాప్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.