
గతేడాది సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రత్యేక పాత్రలో వచ్చిన మూవీ లాల్ సలామ్ (Lal Salaam). రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2024 ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైంది.
ఇందులో విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్ (Vikranth) హీరోలుగా నటించారు. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన లాల్ సలామ్కి ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా మిగిలిపోయింది.
సుమారు రూ.90 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం రూ.19 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. దాంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఏడాదికి.. పై నుండి ప్రశ్నార్ధకంగా మిగిలింది. ఇదిగో వచ్చేస్తోంది.. అదిగో వస్తుందనే వార్తలు వస్తున్నాయే తప్ప.. వచ్చింది మాత్రం లేకుండా పోయింది. అయితే, ఎట్టకేలకు లాల్ సలామ్ థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత స్ట్రీమింగ్కి వచ్చింది. హార్డ్ డిస్క్ మిస్ కావడంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
లాల్ సలామ్ ఓటీటీ:
లాల్ సలామ్ మూవీ నేడు (జూన్ 6న) సన్ నెక్ట్స్ (SunNXT)ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. మొదటి నుంచి అనుకున్నట్టుగానే సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్.. లాల్ సలామ్ స్ట్రీమింగ్కు దారిఇచ్చింది. అయితే, ఈ సినిమా ప్రస్తుతం తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగు భాషలో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులో రానుంది.
గతంలో.. ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ మాట్లాడుతూ.. రజనీకాంత్‌పై దాదాపు 21రోజుల పాటు తీసిన ఓ యాక్షన్ ఎపిపోడ్‌తో పాటు కొన్ని కీలకమైన సీన్స్ తాలూకు హార్డ్ డిస్క్ మిస్సయిందంటూ, ఆ సీన్స్ ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదంటూ రిలీజ్ తర్వాత చెప్పుకొచ్చింది.
ఇక ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ దొరకడంతో..ఓటీటీలో మూవీ రన్ టైమ్ ను 12 నిమిషాలు పెంచారని సమాచారం. ఇందులో రజినీకి సంబంధించిన ముఖ్యమైన సీన్స్ ఉండనున్నాయట. ఇకపోతే థియేటర్లలో ఈ మూవీ రన్ టైమ్ 150 నిమిషాలు.
Enna makkaa... Thalaivar thiruvizha-ku thayaara??? - Naalai mudhal thiruvizha aarambam!!! 😉🔥
— SUN NXT (@sunnxt) June 5, 2025
Lal Salaam - The Extended Version streaming from June 6 on Sun NXT
[Lal Salaam On Sun NXT, Lal Salaam, Rajinikanth, Vishnu Vishal, Vikranth, Aishwarya Rajinikanth, AR Rahman, Senthil,… pic.twitter.com/IQ1LPcCFy5
కథేంటంటే:
లాల్ సలామ్ పూర్తిగా 1990ల కాలంలో నడిచే కథ. హిందూ ముస్లింలు ఐకమత్యంగా సోదర భావంతో మెలిగే ఊరు కసుమూరు. అక్కడి నుంచి ముంబయి వెళ్లి గొప్ప వ్యాపార వేత్తగా ఎదుగుతాడు మొయిద్దీన్ (రజనీకాంత్). తన కొడుకు షంషుద్దీన్ (విక్రాంత్)ను క్రికెటర్‌ను చేయాలన్నది అతని కల.
మొయిద్దీన్ ఊరు వదిలి వెళ్లాక కొందరు రాజకీయ నాయకుల కుట్రల వల్ల ఊళ్లోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోతారు. ఇక ఆ ఊళ్లో 'త్రీస్టార్ - ఎంసీసీ టీమ్స్' మధ్య జరిగే క్రికెట్ ఆట కూడా మతం రంగు పులుముకొని గొడవలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది.
ఒకరోజు మ్యాచ్ నడుస్తుండగా.. రెండు టీమ్స్ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలోనే షంషుద్దీన్ చేతిని నరికేస్తాడు గురు అలియాస్ గురునాథం (విష్ణు విశాల్). ఇంతకీ ఆ గురు మరెవరో కాదు మొయిద్దీన్ ప్రాణ స్నేహితుడి (ఫిలిప్ లివింగ్‌స్టోన్) తనయుడే.
క్రికెట్‌లో జరిగిన ఆ గొడవ క్రమంగా మత కల్లోలంగా మారుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు క్రికెట్‌లో జరిగిన గొడవకు కారణమేంటి? షంషుద్దీన్ చేయి నరికేసేంత కోపం గురుకు ఎందుకొచ్చింది? తన కొడుకు చేయి నరికిన గురును మొయిద్దీన్ ఏం చేశాడు? ఊళ్లో జాతరకు ఈ కథకూ ఉన్న సంబంధం ఏంటి? ఊళ్లోని మత కల్లోలాలు ఎలా సద్దుమణిగాయి? అన్నది మిగతా కథ.