
నటుడు, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ కరూర్ ర్యాలీ విషాదం మిగిల్చింది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ ఘటనపై విజయ్తో పాటు ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ విచారం వ్యక్తం చేస్తూ Xలో పోస్ట్ పెట్టారు. ‘‘ కరూర్ ర్యాలీ తొక్కిసలాటలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన వార్త హృదయాన్ని కదిలించింది. తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోంది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని రజనీకాంత్ తెలిపారు.
கரூரில் நிகழ்ந்திருக்கும் அப்பாவி மக்களின் உயிரிழப்புச் செய்தி நெஞ்சை உலுக்கி மிகவும் வேதனையளிக்கிறது.
— Rajinikanth (@rajinikanth) September 27, 2025
உயிரிழந்தோரின் குடும்பத்தினருக்கு என் ஆழ்ந்த அனுதாபங்கள். காயமடைந்தோருக்கு ஆறுதல்கள்.#Karur #Stampede
తమిళనాడులోని కరూర్‌లో శనివారం (సెప్టెంబర్ 27న) జరిగిన విజయ్, రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 39 మంది మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు హీరోలు, నాయకులు సోషల్ మీడియా వేదికగా బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.
అయితే, తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్ విజయ్ తన ర్యాలీలో ప్రసంగం ముందు, వినడానికి భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. ఈ క్రమంలోనే సాయంత్రం 7.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానిక కథనాలు చెబుతున్నాయి. విపరీతమైన రద్దీ, తోపులాట కారణంగా తమ అభిమాన నటుణ్ని చూడాలని వచ్చిన వారు.. ఊపిరాడక చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అయితే, అంచనాలకు మించి జనం రావడమే, ఈ ప్రమాదానికి కారణం అని తమిళ వర్గాలు వెల్లడిస్తున్నాయి.