Rajinikanth: మీ మాటలు నన్ను కదిలించాయి.. సీఎం చంద్రబాబుకు తలైవా స్పెషల్ థాంక్స్‌

Rajinikanth: మీ మాటలు నన్ను కదిలించాయి.. సీఎం చంద్రబాబుకు తలైవా స్పెషల్ థాంక్స్‌

సూపర్ స్టార్ రజనీకాంత్ (ఆగస్టు 15) నాటికి 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా రజినీకాంత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. 

సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సినిమాల్లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు. తన అద్భుతమైన కెరీర్‌లో, ఆయన తన ఐకానిక్ నటనతో లక్షలాది మందిని అలరించారు. అంతేకాకుండా, సామాజిక అవగాహన పెంచడానికి తన చిత్రాలను ఒక మాధ్యమంగా ఉపయోగించుకున్నారు. ఆయన రచనలు సామాజిక సమస్యలపై ప్రతిబింబించడానికి ఎంతో ప్రేరణనిచ్చాయి. ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’అని తెలిపారు. 

ఈ క్రమంలోనే మీ మాటలు నా హృదయాన్ని తాకాయని చంద్రబాబుకు రజినీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీ మాటలు, మీ అభినందనలు నా హృదయాన్ని కదిలించాయి. ఎంతో అర్ధవంతంగా ఉన్న మీ సందేశం నా మనసుకు హత్తుకుంది. మీ లాంటి వ్యక్తుల ప్రేమ, స్నేహంతో నేను సినిమా పరిశ్రమలో ఉత్తమంగా రాణించడానికి కృషిచేస్తాను’’అంటూ చంద్రబాబుకు తలైవా థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఇరువురి పోస్ట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 

ఇకపోతే.. 'అపూర్వ రాగంగళ్'తో తెలుగులో 'అపూర్వ రాగాలు' రజినీకాంత్ మొదటి సినిమా చేశాడు. 1975లో లెజెండరీ దర్శకుడు కె. బాలచందర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాతోనే తలైవా సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత రజినీ అంచెలంచెలుగా ఎదిగారు. నటనలో, స్టైల్ లో ఎవ్వరికీ అందని శిఖరం అయ్యాడు. తనదైన యాక్షన్, స్టైల్‌తో సంచలనం సృష్టించాడు.

తెలుగులో దళపతి, ముత్తు, బాషా, శివాజీ, రోబో, కబాలి, కాలా, పేట, జైలర్, ఇపుడు కూలీ లాంటి చిత్రాలతో నటించి సూపర్ స్టార్ అయ్యారు.