అదానీ షేర్లపై రెట్టింపు సంపాదిస్తాం : జీక్యూజీ రాజీవ్​ జైన్​

అదానీ షేర్లపై రెట్టింపు సంపాదిస్తాం : జీక్యూజీ రాజీవ్​ జైన్​

అదానీ షేర్లపై రెట్టింపు సంపాదిస్తాం

బ్లూమ్​బర్గ్​ ఇంటర్వ్యూలో జీక్యూజీ  రాజీవ్​ జైన్​

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్​ షేర్లలో పెట్టిన 2 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు రాబోయే కొన్నేళ్లలో రెట్టింపవుతాయని జీక్యూజీ చీఫ్​ ఇన్వెస్ట్​మెంట్​ ఆఫీసర్​ రాజీవ్​ జైన్​ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్​ షార్ట్​ సెల్లర్​ హిండెన్​బర్గ్​ ప్రకటించిన రిపోర్టుతో అదానీ గ్రూప్​ ఆర్థికంగా చిక్కుల్లో పడిన టైములో జీక్యూజీ ఈ పెట్టుబడులు పెట్టడం విశేషం. రాబోయే అయిదేళ్లలో అదానీ గ్రూప్​ షేర్లు మల్టీ బాగర్స్​ అవుతాయని జైన్​ బ్లూమ్​బర్గ్​కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు. పెట్టుబడి కనీసం డబులైతే అలాంటి పెట్టుబడులను మల్టీ బాగర్స్​గా వ్యవహరిస్తారు.

హిండెన్​బర్గ్​ రిపోర్టు చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్​ సంపద 153 బిలియన్ డాలర్ల దాకా ఆవిరయిపోయింది. అదానీ గ్రూప్​ షేర్ల ధరల మానిప్యులేషన్​తోపాటు, మోసాలకూ పాల్పడుతోందని హిండెన్​బర్గ్​ రిపోర్టు ఆరోపించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్​ తిరస్కరించింది. అలాగే, జైన్​ పెట్టుబడుల నిర్ణయంపైనా ఆ రిపోర్టు ఎఫెక్ట్​ చూపించలేకపోయింది. అదానీ గ్రూప్​ వాల్యూ కంపెనీ ఎసెట్లలో ఉందని జైన్​ చెప్పారు. దేశంలోని వివిధ రంగాలలో అదానీ గ్రూప్​ పెట్టుబడులు పెట్టింది. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ చాలా ముఖ్యమని గుర్తించిన ప్రభుత్వం, ఆ దిశలో తీసుకుంటున్న చొరవలో భాగం అయ్యేందుకు ముందు నుంచీ అదానీ గ్రూప్​ ప్రయత్నిస్తోంది.

అదానీ గ్రూప్​ చేతిలోని బొగ్గు గనులు, డేటా సెంటర్లు, ముంబై ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టులో మెజారిటీ వాటా వంటివన్నీ హెల్తీ బిజినెస్​లేనని రాజీవ్​ జైన్​ పేర్కొన్నారు. ఎయిర్​పోర్ట్​ విలువే కంపెనీ విలువ కంటే ఎక్కువ ఉంటుందని జైన్​ వెల్లడించారు. ఆసియాలోనే అత్యంత ఖరీదైన అర్బన్​ రియల్​ ఎస్టేట్​ ఈ ఎయిర్​పోర్టు కింద ఉందని పేర్కొన్నారు.