
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం హైవే సమీపంలోని కుర్మల్ గూడ లో రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు అధికారులు సోమవారం వేలం నిర్వహించారు. మొత్తం 20 ప్లాట్లకు 34 మంది వేలంలో పాల్గొనగా 15 ప్లాట్లు అమ్ముడయ్యాయి. గజం రూ.20 వేలుగా ఖరారు చేయగా వేలంలో గజం రూ.28,500కు అమ్ముడుపోయిందని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. వేలం ద్వారా రూ. 9.6 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. మంగళవారం మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా బహదూర్ పల్లి, బుధవారం రంగారెడ్డి జిల్లా తొర్రూరులో ఓపెన్ ప్లాట్లకు కూడా వేలం నిర్వహిస్తున్నామని ఎండీ తెలిపారు.